ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో తాజాగా 1124 కరోనా పాజిటివ్ కేసులు - గుంటూరు జిల్లాలో కరోనా కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం ఒక్కరోజే 1124 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 13,671 కి చేరింది.

corona positive
corona positive

By

Published : Jul 30, 2020, 2:39 AM IST

గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి తీవ్రరూపం దాల్చింది. రికార్డుస్థాయిలో బుధవారం ఒక్కరోజే 1124 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో జిల్లాలో కొవిడ్ వైరస్ బారినపడిన వారి సంఖ్య 13 వేల 671 కి చేరినట్లు అధికారులు వెల్లడించింది. గుంటూరు జిల్లాలో నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు కార్పొరేషన్ పరిధిలోనివే. ఏకంగా 395 పాజిటివ్ కేసులను ఇక్కడ గుర్తించారు. చిలకలూరిపేటలో 64, నరసరావుపేటలో 52, సత్తెనపల్లిలో 46 కేసులు, బాపట్లలో 41 కేసులు, పిడుగురాళ్లలో 39, అమరావతిలో 38, రొంపిచర్లలో 33 కేసులు, పెదనందిపాడులో 32, తాడేపల్లిలో 28, మంగళగిరి, తెనాలిలో 27, క్రోసూరులో 25 కేసుల చొప్పున నమోదయ్యాయి. రేపల్లెలో 19, రాజుపాలెం, తుళ్లూరులో 17 కేసులు చొప్పున, పొన్నూరులో 16, అమర్తలూరు, దాచేపల్లిలో 15 కేసులు చొప్పున, గుంటూరు గ్రామీణ మండలంలో 14, కారంపూడి 13, మాచర్లలో 11, నాదెండ్ల 10 కేసులు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details