గుంటూరు జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో కరోనా కలకలం రేపింది. బాపట్ల నియోజకవర్గంలోని రెండు ప్రభుత్వ పాఠశాలల్లో 10 మంది కరోనా బారిన పడ్డారు. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నలుగురు విద్యార్థులకు, ఒక ఉపాధ్యాయురాలికి కరోనా నిర్ధారణ అయ్యింది.
Corona in government schools: ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం - గుంటూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు
గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలవరపెడుతోంది. పలువురు విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పాఠశాలలో కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాటుగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం
బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామంలోని బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులకు పాజిటివ్ నిర్ధారణ కాగా.. వారిలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు నలుగురు, తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఒకరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. పాఠశాలలో పారిశుధ్య పనులు చేపట్టారు.
ఇదీ చదవండి: స్నేహితుల మధ్య ఘర్షణ.. కత్తెరతో మెడపై దాడి..