ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్తపల్లిలో కరోనా కేసు.. రెడ్​జోన్​గా ప్రకటన - ap corona cases

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో కరోనా కేసు నమోదైంది. దీంతో ఆ గ్రామాన్ని అధికారులు రెడ్​ జోన్​గా ప్రకటించారు. ముంబయి నుంచి గ్రామానికి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా నిర్ధరణ అయినట్లు వైద్యులు తెలిపారు. అతని ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్​లకు కరోనా పరీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గ్రామాన్ని సందర్శించి కరోనా నివారణ చర్యలపై ఆరా తీశారు.

కొత్తపల్లిలో కరోనా కేసు.. రెడ్​జోన్​గా ప్రకటన
కొత్తపల్లిలో కరోనా కేసు.. రెడ్​జోన్​గా ప్రకటన

By

Published : Jun 3, 2020, 11:39 PM IST

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో బుధవారం తొలి కరోనా కేసు నమోదైంది. అప్రమత్తమైన అధికారులు కొత్తపల్లి గ్రామాన్ని రెడ్​జోన్​గా ప్రకటించారు. కొత్తపల్లి గ్రామాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ.. ముంబయి నుంచి కొత్తపల్లి గ్రామానికి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా నిర్ధరణ అయినట్లు తెలిపారు.

కొత్తపల్లి గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి

కరోనా బాధితుడి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్​లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామస్థులంతా అధికారుల సూచనలు పాటించాలని కోరారు. గ్రామస్థులందరికీ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఎవరికైనా ఆరోగ్యపరమైన అనుమానాలు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని తెలిపారు.

గ్రామస్థులకు అవసరమైన నిత్యావసరాలు, కూరగాయలను వాలంటీర్ల ద్వారా అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్​లు తప్పనిసరిగా ధరించాలన్నారు. వైద్య అధికారులు, వాలంటీర్లకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.

ఇదీ చదవండి :వణికిపోతున్న నవాబుపేట.. ఒకేరోజు 18 కరోనా కేసులు!

ABOUT THE AUTHOR

...view details