ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆసుపత్రిలో సౌకర్యాలు సరిగ్గా లేవంటూ కరోనా బాధితుల ఆందోళన - ప్రత్తిపాడులో కరోనా బాధితుల ఆందోళన వార్తలు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పరిధిలోని ఓ వైద్యశాలలో సరైన సౌకర్యాలు కల్పించడం లేదంటూ కరోనా బాధితులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భోజనం బాగాలేదని, పరిశుభ్రంగా ఉంచడంలేదని ఆరోపిస్తున్నారు. మాత్రలు సమయానికి ఇవ్వడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

corona patients protest in prattipadu guntur district
ఆసుపత్రిలో సౌకర్యాలు సరిగ్గా లేవంటూ కరోనా బాధితుల ఆందోళన

By

Published : Sep 24, 2020, 4:33 PM IST

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పరిధిలోని ఓ వైద్యశాలలో సరైన సౌకర్యాలు కల్పించడం లేదంటూ కరోనా బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భోజనం బాగా లేదని, అన్నంలో సున్నం కలుపుతున్నారని, అది తింటే కడుపులో నొప్పి వస్తోందటూ ఆరోపిస్తున్నారు. బీపీ, షుగర్ మాత్రలు అయిపోయాయి ఇవ్వడంటే.. అలాంటివి ఇక్కడ ఇవ్వరంటూ పెడసరిగా సమాధానం చెప్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. డబ్బులిచ్చి బయటనుంచి తీసుకురమ్మన్నా తీసుకురావడం లేదని వాపోయారు.

ఆసుపత్రిలో సౌకర్యాలు సరిగ్గా లేవంటూ కరోనా బాధితుల ఆందోళన

మరుగుదొడ్లు శుభ్రం చేయడంలేని, దుర్వాసన భరించలేక అల్లాడిపోతున్నట్లు తెలిపారు. కొంతమంది వాలంటీర్లు బెదిరించి కరోనా పరీక్షలు చేయిస్తున్నారని వృద్ధులు అంటున్నారు. ఇక్కడ బాగా చూస్తారనుకుంటే పరిస్థితి ఇలా ఉందని ఆవేదన చెందారు. ఇక్కడ ఉంటే కొవిడ్ తగ్గడం ఏమో కానీ.. కొత్త రోగాలు వచ్చేలా ఉన్నాయని చెప్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి వాటిని పరిశీలించాలని బాధితులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details