గుంటూరు జిల్లా వేమూరు మండలంలో కరోనా సోకిందని మనస్థాపానికి గురై ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాకర్లపూడి గ్రామానికి చెందిన చందు సురేశ్ కొవిడ్ సోకడంతో జగ్గడిగుంటపాలెంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్ సెంటర్లో చికిత్స పోందుతున్నాడు. ఈ క్రమంలోనే మనస్థాపానికి గురైన అతను కొవిడ్ కేర్ సెంటర్ నుంచి బయటకు వచ్చి కూచిపూడి గ్రామంలోని పొలాల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పురుగుల మందు తాగి కరోనా బాధితుడు ఆత్మహత్య - గుంటూరు జిల్లా నేర వార్తలు
కరోనా సోకిందని మనస్థాపానికి గురై ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా వేమూరు మండలంలో జరిగింది. పోస్టమార్టం నిమిత్తం మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు.
పురుగుల మందు తాగి కరోనా బాధితుడు ఆత్మహత్య