ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో కరోనా కల్లోలం - Corona Vaccination Latest News

అంతకంతకూ పెరుగుతోన్న కరోనా వ్యాప్తి గుంటూరు జిల్లా వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా 271 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అధిక భాగం కేసులు నగరపాలక పరిధిలోనే ఉండటంతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు.

గుంటూరు జిల్లాలో కరోనా కల్లోలం
గుంటూరు జిల్లాలో కరోనా కల్లోలం

By

Published : Apr 6, 2021, 2:59 AM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు మళ్లీ కలకలం సృష్టిస్తున్నాయి. సోమవారం ఒక్క రోజే 271 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకు కేసులు పెరగుతుండంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

ఎక్కువగా నగరపాలక పరిధిలోనే..

తాజాగా నమోదైన కేసుల్లో ఎక్కువగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే ఉండటం నగర వాసులను కలవర పరుస్తోంది. కార్పొరేషన్ పరిధిలో 76 కేసులు, తెనాలి పరిధిలో 77 కేసులు, నరసరావుపేటలో 31 చొప్పున కేసులు నమోదయ్యాయి.

మాస్కు ధారణ తప్పనిసరి..

మొత్తంగా జిల్లాలో కేసుల సంఖ్య 79 వేల 334కి చేరింది. ప్రస్తుతం జిల్లాలో క్రియాశీల కేసుల సంఖ్య వెయ్యి 511కి పెరిగాయి. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ విస్తృతంగా చేపట్టింది. కరోనా వ్యాప్తి విజృంభిస్తుండటంతో బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల ధరించడం తప్పనిసరి చేశారు.

ఇవీ చూడండి :కరోనా ఎఫెక్ట్.. మూడు రోజులపాటు ఆ బ్యాంకులు మూసివేత

ABOUT THE AUTHOR

...view details