కరోనా వైరస్ ఎంత ప్రమాదకారో సామాన్య ప్రజలకు అర్థమయ్యేందుకు రహదారులపై చిత్రాలు వేస్తూ అవగాహన కల్పిస్తున్నారు గుంటూరు చిత్రకారులు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఎన్టీఆర్ కూడలి వద్ద కరోనా తీవ్రతను వివరిస్తూ పెయింటింగ్ వేశారు. భౌతిక దూరం పాటించకపోతే కరోనా రక్కసి మింగేస్తుందని స్ఫురించేలా వేసిన చిత్రం వైరస్ ప్రభావం కళ్లకు కట్టేలా ఉంది. మహమ్మారిని పారద్రోలేందుకు కృషి చేస్తున్న పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు చిత్రాల ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.
లక్ష్మీనగర్ కూడలి వద్ద ఫోటోగ్రఫీ అనుబంధ కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 'ఇంట్లోనే ఉందాం... ప్రాణాలు కాపాడుకుందాం... కరోనాను తరిమి కొడదాం' అంటూ నినదిస్తూ ఉన్న చిత్రం ఆలోచింపజేస్తోంది.