ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: మాస్కులు అమ్ముతున్న గాయకుడు - corona effect on artists in tenali

కోవిడ్ మహమ్మారి సామాన్యుల జీవితాలనే కాదు.. చిన్నచిన్న కళాకారుల్ని సైతం తీవ్రంగా దెబ్బతీసింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ కళాకారుడు మాస్కులు అమ్ముకుంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం తమలాంటి వారికి ఆర్థికంగా చేయూతనివ్వాలని కోరుతున్నారు.

కరోనా ఎఫెక్ట్: గాయకుడు మాస్కులు అమ్ముకుంటూ జీవనం
కరోనా ఎఫెక్ట్: గాయకుడు మాస్కులు అమ్ముకుంటూ జీవనం

By

Published : Aug 5, 2020, 4:11 PM IST

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గాయకుడు షబ్బర్ ఖాన్ శుభకార్యాలు, వేడుకల్లో పాటలు పాడుతూ జీవనం సాగించేవారు. కరోనా కారణంగా ఎలాంటి ఫంక్షన్లు లేకపోవటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈయన తన 13వ ఏట నుంచి పాటలు పాడుతూ జీవనం కొనసాగిస్తున్నారు. సొంతంగా ఆర్కెస్ట్రా బృందాన్ని ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు నిర్వహించేవారు. లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడంతో.. కుటుంబాన్ని పోషించుకునేందుకు మాస్కులు విక్రయిస్తున్నారు. పాటలు పాడటం తప్ప తనకు వేరే పని తెలియదని షబ్బర్ ఖాన్ అంటున్నారు. తన మాదిరిగానే చాలామంది కళాకారులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తమలాంటి పేద కళాకారుల్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

కరోనా ఎఫెక్ట్: గాయకుడు మాస్కులు అమ్ముకుంటూ జీవనం
ఇవీ చదవండి

సత్తెనపల్లిలో కానరాని భౌతిక దూరం

ABOUT THE AUTHOR

...view details