రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు పోలేరమ్మ తల్లి తిరునాళ్లు ఏకాంతంగా నిర్వహించారు. ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భక్తలు తిరునాళ్లలో పాల్గొంటారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సారి భక్తులను అనుమతించలేదు. ఆలయ ఆవరణ నిర్మానుష్యంగా కనిపించింది. అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూలతో పోలేరమ్మ తల్లిని చక్కగా అలంకరణ చేశారు.
అమ్మవారి సిరిమాను మహోత్సవానికి భక్తులు తరలివస్తారు. ప్రస్తుతం సిరిమానును తయారు చేసి అమ్మవారి ఆలయం ఎదుట ఉంచారు. అందులో అమ్మవారి స్వరూపమైన మేకపోతును ఉంచి పూజ చేస్తారు. తిరునాళ్లకు వేరే ప్రాంతాల నుంచి భక్తులు రాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామానికి నాలుగు వైపులా పోలీసులు పికెట్ లు ఏర్పాటు చేసి గ్రామంలోకి బయట వారు రాకుండా గస్తీ నిర్వహించారు.