గుంటూరు జిల్లా తెనాలిలో అనారోగ్యంతో మృతి చెందిన ఓ వృద్దుడి అంత్యక్రియలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తెనాలి మండలం గుడివాడకు చెందిన 71 సంవత్సరాల వృద్ధుడు శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. అతని పిల్లలు లేకపోవడం, బంధువులు దూరంగా ఉండటం, భార్య వృద్ధురాలు కావటంతో అంత్యక్రియలకు సమస్య ఎదురైంది. వృద్ధుడికి కరోనా వచ్చిందేమోననే అనుమానంతో ఇరుగు పొరుగు కూడా ముందుకు రాని పరిస్థితి. ఈ సమయంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తజన సేవా సమితికి విషయం తెలిసింది. దీంతో సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీనివాస్ వృద్ధుని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. తన బృందంతో కలిసి పీపీఈ కిట్లు ధరించి అన్ని రక్షణ చర్యలు తీసుకుని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.
కరోనా ఎఫెక్ట్: వృద్ధుడి అంత్యక్రియలకు ఆటంకం - corona effect news in guntur
కరోనా మహమ్మారి సొంత కుటుంబీకులనే దూరం చేస్తోంది. ముదిమి వయస్సులో ఆదరించాల్సిన పిల్లలే వృద్ధులను బయటికి గెంటేస్తున్నారు. మరికొంతమంది ఏకంగా అనాథ శరణాలయాలకే తరలిస్తున్నారు. ఇలా ఎన్నో ఘటనలు ఈ మధ్యకాలంలో చూసే ఉంటాం. తెనాలిలో ఓ వృద్ధుడు అనారోగ్యంతో చనిపోతే అంత్యక్రియలు జరిపేందుకు ఎవరు ముందుకు రాలేదు. చివరికి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తజన సేవా సమితికి ముందుకు వచ్చి అంత్యక్రియలు జరిపించి మానవత్వం చాటుకున్నారు.
కరోనా ఎపెక్ట్: వృద్ధుడి అంత్యక్రియలకు ఆటంకం