కరోనా ప్రభావంతో గుంటూరు నగరం కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది. నిత్యం రద్దీగా ఉండే సినిమా థియేటర్లు, పార్కులు, రహదారులు బోసిపోయాయి. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు మూతపడ్డాయి. ఇళ్ల నుంచి బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో సభలు, సమావేశాలకు అధికారులు అనుమతులు ఇవ్వటం లేదు. పట్టణంలో రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి.
కరోనా ఎఫెక్ట్: గుంటూరులో కర్ఫ్యూ వాతావరణం - covid19
కరోనా ప్రభావంతో గుంటూరు నగరం వెలవెలబోతోంది. పట్టణంలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. సామాజిక దూరం పాటించాలన్న స్పృహతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావటానికి భయపడుతున్నారు.
కరోనా ఎఫెక్ట్: గుంటూరులో కర్ఫ్యూ వాతావరణం