గుంటూరు జిల్లా మంగళగిరి లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందికి కరోనా సోకడం, మరికొంతమంది ప్రైమరీ కాంటాక్ట్‌లో భాగంగా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని ఆగస్టు1 నుంచి 6వ తేదీ వరకు మూసేస్తున్నట్లు ఈవో పానకాల రావు తెలియజేశారు. కొండపైన ఉన్న పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సైతం మూసేస్తున్నామని చెప్పారు.
మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేత - corona effect on sri laxmi narasimha temple closed
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం నుంచి గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆలయంలోని సిబ్బందికి వైరస్ సోకటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కరోనా ఎఫెక్ట్: మంగళగిరిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేత
ఇవీ చదవండి