గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 164 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 72వేల 61 కేసులకు చేరింది. తాజా కేసుల్లో.. అత్యధికంగా గుంటూరు నగరం నుంచి 33 మందికి కోవిడ్ సోకింది. బాపట్ల, మంగళగిరి నుంచి 12 కేసుల చొప్పున, అమరావతి మండలంలో 11 కేసులు బయటపడ్డాయి.
మొత్తంగా.. జిల్లాలో 69వేల 809 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్ వైరస్ ప్రభావంతో ఒకరు మరణించగా... జిల్లాలో కరోనా మహమ్మారి కారణంగా మృతిచెందినవారి సంఖ్య 644కి పెరిగింది. కరోనాతో అత్యధికంగా మృతి చెందినవారి సంఖ్యలో గుంటూరు జిల్లా రెండో స్థానంలో కొనసాగుతోంది.