ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో కరోనా కల్లోలం.. గరిష్ఠంగా నమోదవుతున్న కేసులు - guntur news

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు గరిష్ఠంగా నమోదవుతున్నాయి. వీటిలో అధిక శాతం గుంటూరు నగర పరిధిలో నమోదవుతున్నాయని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

guntur district corona cases details
గుంటూరు జిల్లా కరోనా కేసుల వివరాలు..

By

Published : May 9, 2021, 8:47 PM IST

గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. జిల్లాలో తాజాగా 2099 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 793 కేసులు బయటపడ్డాయి. జిల్లాలోని మంగళగిరిలో-148 కేసులు, నరసరావుపేట- 89 కేసులు, తెనాలి- 63, బాపట్ల- 47, చిలకలూరిపేట- 49, మాచర్ల-91, తుళ్లూరు-48, సత్తెనపల్లి- 68, తాడేపల్లి- 55, అమరావతి- 63 కేసుల చొప్పున నమోదయ్యాయి. వైరస్​ వల్ల రాష్ట్రంలోనే నేడు గుంటూరులో అత్యధికంగా 12 మంది మృత్యువాత పడ్డారు. వీటితో జిల్లాలో మృతి చెందిన వారి సంఖ్య 779కి పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో 17 వేల 764 క్రీయాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details