గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నియోజకవర్గంలో ఆదివారం నమోదైన కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 154కు చేరింది. జిల్లాలో కేసుల పరంగా గుంటూరు, నరసరావుపేట తర్వాతి స్థానం మంగళగిరి నియోజకవర్గం ఆక్రమించింది. ఇప్పటివరకు తాడేపల్లిలో 89, మంగళగిరి పట్టణంలో 17, మంగళగిరి మండలంలో 26, దుగ్గిరాల మండలంలో 12, ఎన్నారై ఆస్పత్రిలో 4, ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్లో 6 కేసులు నమోదయ్యాయి. మంగళగిరి మండలంలోని నవులూరు గ్రామంలోనే 12 మందికి కరోనా సోకింది. ఇందులో సచివాలయ ఉద్యోగులు సైతం ఉన్నారు. అధికారులు నవులూరులో పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేస్తున్నారు. మంగళగిరిలో పాజిటివ్ వచ్చిన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.
మంగళగిరి నియోజకవర్గంలో కరోనా ఉద్ధృతం - మంగళగిరి నియోజకవర్గంలో కరోనా కేసులు వార్తలు
మంగళగిరి నియోజకవర్గంలో కరోనా ఉద్ధృతంగా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరుగుతోంది. మంగళగిరి మండలంలోని నవులూరు గ్రామంలోనే 12 కేసులు నమోదవటంతో అక్కడ పూర్తి స్థాయి లాక్డౌన్ విధించారు అధికారులు.
mangalagiri news