గుంటూరు జిల్లా తెనాలిలో కరోనా ఉద్ధృతి తగ్గటం లేదు. నేడు నమోదైన 18 కేసులతో... ఇప్పటి వరకు 283 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు నిబంధనలు మరింత కఠినంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచి ఈనెల 22 వరకు వెండి, బంగారం దుకాణాలు మూసివేయాలని యజమానులు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ కార్యాలయ డీఈ తీవ్రమైన జ్వరంతో మృతి చెందటంతో... కార్యాలయ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. డీఈ మృతదేహం నుంచి స్వాబ్ స్వీకరించి, కరోనా పరీక్షలకు పంపించారు.
తెనాలిలో తగ్గని కరోనా ఉద్ధృతి
గుంటూరు జిల్లా తెనాలిలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొద్ది రోజులు క్రితం కరోనాతో వైద్యుడు మృత్యువాత పడటంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు.
తెనాలిలో కరోనా ఉద్ధృతి