ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో విజృంభిస్తున్నకరోనా... 5 వేలు దాటిన కేసులు - corona latest news guntur

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం ఒక్క రోజే జిల్లాలో 399 కేసులు నమోదయ్యాయి. వీటిలో 103 కేసులు గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోనే ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

corona cases raised to guntur district
గుంటూరు జిల్లాలో విజృంభిస్తున్నకరోనా

By

Published : Jul 17, 2020, 12:53 AM IST

గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే జిల్లాలో 399 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 103 కేసులు గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోనే అధికారులు గుర్తించారు. గుంటూరు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే.. తెనాలి-54, పెద్దకాకాని -54, మంగళగిరి -33, మాచెర్ల -28, తాడేపల్లి -23, వినుకొండ -9, చిలకలూరిపేట -6, బాపట్ల -6, చండూరు -5, సత్తెనపల్లి - 5, నాదెండ్ల -5, వేమూరు -4, ఎడ్లపాడు -3, పిడుగురాళ్ల -3, రాజుపాలెం -3, వెల్దుర్తి -3, బొల్లాపల్లి -2, దాచేపల్లి -2, దుగ్గిరాల -2, మాచవరం -2, కారంపూడి -2, ఫిరంగిపురం- 2, మేడికొండూరు -2 చొప్పున కేసులు నమోదు కాగా... బెల్లంకొండ -1, గురజాల -1, ఈపూరు -1, కర్లపాలెం -1, ముప్పాళ్ల - 1, నరసరావుపేట -2, నిజంపట్నం -1, పెద్దనందిపాడు -1, ప్రతిపాడు -1, రెంటచింతల- 1, రోంపిచెర్ల -1, శావల్యాపురం -1, తుళ్లూరు -1, వట్టిచెరుకూరు-1 చొప్పున కేసులు నమోదయ్యాయి.

వీటితో పాటు కర్ణాటక రిటర్న్ -1 , తెలంగాణ రిటర్న్ - 21 , క్వారంటైన్ సెంటర్ - 11 చొప్పున కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో జిల్లావ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 5086 కి చేరాయి. కేసుల పెరుగుదల దృష్ట్యా 18 నుంచి జిల్లా వ్యాప్తంగా షాపులు, దుకాణాలపై ఆంక్షలు విధిస్తూ కలెక్టర్ శామ్యూల్ ఆనంద కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే విక్రయాలు జరపాలని స్పష్టం చేశారు. కరోనా కేసుల పెరుగుదలతో ఈ నిర్ణయం తీసుకున్నామన్న కలెక్టర్.. వారం రోజుల పాటు నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. రోడ్ల పక్కన బండ్లు, చిరు వ్యాపారాలకు సైతం ఇవే నిబంధనలు వర్తిస్తాయని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details