గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ మరో ఐదు పాజిటివ్ రాగా... మొత్తం కేసుల సంఖ్య 214కు చేరింది. కొత్తగా వచ్చిన పాజిటివ్ కేసుల్లో ఇద్దరు... కృష్ణా జిల్లా నూజివీడు క్వారంటైన్ కేంద్రంలో ఉన్నారు. మరొకరు శ్రీనివాసరావుపేటకు చెందినవారు కాగా.. ఇంకో ఇద్దరు నరసరావుపేటకు చెందినవారు ఉన్నారు.
కేసుల సంఖ్య పెరిగిందిలా..!
తేదీ | కేసులు |
మార్చి 25 | తొలి కేసు |
ఏప్రిల్ 10 | 50 |
ఏప్రిల్ 14 | 100 |
ఏప్రిల్ 21 | 150 |
ఏప్రిల్ 24 | 200 |