గుంటూరు జిల్లాపై కరోనా మహ్మమారి పడగవిప్పింది. నిన్న జిల్లాలో రికార్డుస్థాయిలో 616 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులివే. అత్యధికంగా గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 271 కేసులు బయటపడ్డాయి. సత్తెనపల్లి మండలంలో 40, నరసరావుపేటలో 29, వినుకొండ 27, పెదకాకాని 21, తెనాలి 19, పిడుగురాళ్ల 18, అమరావతి మండలంలో 17, బాపట్ల 11, చిలకలూరిపేట 20, మంగళగిరి 26, మాచవరం 13, ముప్పాళ్ల 12, నకరికల్లు 9, పొన్నూరు 9, తుళ్లూరు 8, ఫిరంగిపురంలో 6 చొప్పున కేసులు నమోదయ్యాయి.
బుసలు కొడుతున్న మహమ్మారి... రికార్డుస్థాయిలో 616 కేసులు - గుంటూరులో కరోనా కేసులు
గుంటూరు జిల్లాలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 616 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 271 కేసులు వచ్చాయి. జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రి మోపిదేవి వెంకటరమణ అధికారులతో సమీక్షించారు
కొత్త కేసుల నమోదుతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 7,236కి పెరిగింది. కేవలం 6 రోజుల్లోనే 2,625 కేసులు నమోదయ్యాయంటే వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అర్థమవుతుంది. కోవిడ్ వైరస్ కారణంగా నిన్న గుంటూరులో 8 మంది మృతిచెందారు. జిల్లాలో కోవిడ్ వైరస్ తో చనిపోయిన వారి మొత్తం సంఖ్య 57కి పెరిగింది.గుంటూరు నగరంతో పాటు సత్తెనపల్లి, నరసరావుపేట, మంగళగిరి, వినుకొండ, తెనాలిలో కరోనా కేసులు హడలెత్తిస్తున్నాయి. జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రి మోపిదేవి వెంకటరమణ అధికారులతో సమీక్షించారు. కోవిడ్ అనుమానిత లక్షణాలు, పరీక్షలు, వైద్యచికిత్సలపై ప్రజలకు మరింత అవగాహన అవసరమని...వీటిని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: మంత్రివర్గంలోకి వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు..!