ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ - గుంటూరు జిల్లాలో కోవిడ్ వార్తలు

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. జిల్లాలో నిన్న కొత్తగా 808 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో జిల్లావ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 40వేల 699కి చేరింది.

corona cases increasing at guntur
గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ

By

Published : Sep 5, 2020, 8:04 AM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 136 కేసులు బయటపడ్డాయి. తర్వాత మంగళగిరిలో 38, తాడేపల్లిలో 33, సత్తెనపల్లిలో 25, ముప్పాళ్లలో 18, పెదనందిపాడులో 17, అచ్చంపేటలో 21 కేసులు నమోదయ్యాయి. గురజాల డివిజన్లో పిడుగురాళ్లలో 21 కేసులు, కారంపూడిలో 17 కేసులను గుర్తించారు. నరసరావుపేటలో 102 కేసులు, శావల్యాపురంలో 15 కేసులు చొప్పున నమోదు కాగా... తెనాలిలో 83 కేసులు, బాపట్లలో 63, చుండూరులో 20, అమర్తలూరులో 16 కేసులు నమోదయ్యాయి. గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలో ఇప్పటివరకు 12వేల 696 కేసులు నమోదయ్యాయంటే... వైరస్ వ్యాప్తి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. వీటిలో 4వేల 507 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గుంటూరు తర్వాత నరసరావుపేటలో 3వేల120 కేసులు, తాడేపల్లిలో 1463 కేసులు నమోదయ్యాయి. ఇవి కాకుండా వివిధ మండలాల్లో 23వేల 420 కేసులను పాజిటివ్ గా గుర్తించారు. పల్లె, పట్టణం తేడా లేకుండా వైరస్ వ్యాప్తి చెందుతోంది.మరోవైపు పరీక్షలను వేగవంతం చేశామని.... ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను సాధ్యమైనంత త్వరగా గుర్తించి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది

జిల్లాలో ఇప్పటివరకు 3 లక్షల 72వేల 562 మంది నుంచి స్వాబ్ నమూనాలు తీయగా... ఇప్పటివరకు 3లక్షల 69 వేల 514 నమూనాల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో 3లక్షల 28వేల 815 మందికి నెగిటెవ్ రాగా.... 3వేల 48 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. వీటిలో 40వేల 699 శాంపిళ్లను పాజిటివ్​గా నిర్ధారించారు. అంటే మొత్తం నమూనాల్లో 11 శాతం పాజిటివ్​గా తేలాయి. ప్రస్తుతం 18వేల 650 పాజిటివ్ కేసులు క్రియాశీలంగా ఉండగా.... 21, 582 మంది డిశ్చార్జయ్యారు. ఇప్పటివరకు 467 మంది మృతి చెందారు.

అంటే పాజిటివ్ కేసుల్లో మృతుల శాతం 1.15 శాతం మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. పాజిటివిటీ రేటు కూడా గణనీయంగా తగ్గిందని.. కేసుల సంఖ్యకు అనుగుణంగా ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో పడకలను అందుబాటులో ఉంచుతున్నామని జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ చెప్పారు. అనుమతులు లేని ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా, పర్యవేక్షణకు జిల్లా యంత్రాంగం స్పెషల్ స్క్వాడ్ ను నియమించిందని జేసీ చెప్పారు . కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సకాలంలో వాటి గుర్తింపు, నియంత్రణపై జిల్లాయంత్రాంగం దృష్టి సారించింది. జిల్లాలో ప్రతి 10 లక్షల మందిలో ప్రస్తుతం 76వేల 345 మందికి పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చూడండి.ఏపీఎంఐడీసీ నియామకాల్లో మార్పులు

ABOUT THE AUTHOR

...view details