గుంటూరు జిల్లాలో కొత్తగా 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 68వేల 374కు చేరాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగర పరిధిలోనే 87 ఉన్నాయి. తాడేపల్లిలో-25, బాపట్లలో-17, తెనాలిలో-16, మంగళగిరిలో-15, అమృతలూరులో-14, పెదకాకానిలో-11, తాడికొండలో-10, మాచర్లలో-10, కొల్లూరులో-10 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 63 వేల 117 ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 618 కి చేరింది. రాష్ట్రంలో కరోనా కారణంగా అధిక మరణాలు నమోదవుతున్న జిల్లాల్లో గుంటూరు రెండో స్థానంలో కొనసాగుతోంది.
గుంటూరు జిల్లాలో కొత్తగా 324 కరోనా కేసులు - గుంటూరు జిల్లాలో కరోనా మరణాలు వార్తలు
గుంటూరు జిల్లాలో కొత్తగా 324 కరోనా పాజిటివ్ కేసులు రాగా...గుంటూరు నగరంలోనే 87 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటికి వైరస్‌తో 618 మంది మరణించారు.
గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు