గుంటూరు జిల్లాలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే 378 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదైన జిల్లాగా నమోదు కావడంపై.. ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాజాగా నమోదైన కేసుల్లో ఎక్కువగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే ఉన్నాయి.
కార్పొరేషన్ పరిధిలో 108 కేసులు, తెనాలి పరిధిలో 98 కేసులు, తాడేపల్లిలో 29, నరసరావుపేటలో 27, చేబ్రోలులో 14, రేపల్లెలో 11, పొన్నూరులో 9, దుగ్గిరాలలో 8, వినుకొండలో 7, చిలకలూరిపేటలో 4 కేసులు చొప్పున నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 79 వేల 63కి చేరింది. ప్రస్తుతం జిల్లాలో క్రియాశీల కేసుల సంఖ్య 1314కి పెరిగాయి. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ విస్తృతంగా చేపడుతోంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల ధరించడం తప్పనిసరి చేశారు.