గుంటూరు జిల్లాలో కోవిడ్-19 ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. జిల్లాలో కొత్తగా 76 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,111 కు చేరుకుంది. నగరంలో 49 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు తూర్పునియోజకవర్గంలో కేసుల తాకిడి ఎక్కువ ఉండగా... తాజాగా పశ్చిమ నియోజకవర్గానికి కరోనా కేసులు వ్యాపిస్తున్నాయి.
గుంటూరు జిల్లాలో విజృంభిస్తోన్న కరోనా
కరోనా వ్యాప్తి గుంటూరు జిల్లాలో తీవ్రతరమైంది. ఇప్పటి వరకు తూర్పు నియోజకవర్గానికి పరిమితమైన కరోనా కేసులు... పశ్చిమ నియోజకవర్గానికి విస్తరిస్తున్నాయి. కరోనా కారణంగా జిల్లాలో ఇద్దరు మరణించగా... మొత్తం మృతుల సంఖ్య 16కు చేరింది.
గుంటూరు జిల్లాలో తీవ్రతరమైన కరోనా కేసులు
తాడేపల్లిలో 5, తెనాలిలో 4, తేలప్రోలులో 4 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మంగళగిరి, యర్రబాలెం, ఉండవల్లిలో 2 కేసుల చొప్పున, చేబ్రోలు, తాడికొండ, పెదనందిపాడు, అమరావతి, విజయపురి సౌత్, పెదకాకాని, పొన్నూరు, రెయిన్ ట్రీ పార్కుల్లో ఒక్కో కేసు వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బులిటెన్ విడుదల చేశారు. కరోనా నుంచి కోలుకుని 577 మంది డిశ్చార్జ్ కాగా 534 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి..
అచ్చెన్నపై అనిశా ప్రశ్నల వర్షం... ఇవాళ, రేపు కొనసాగనున్న విచారణ
Last Updated : Jun 27, 2020, 6:32 AM IST