గుంటూరు జిల్లా తాడేపల్లిలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా తాడేపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ కరకట్ట, ఉండవల్లి కూడలి, సీఎం నివాసానికి అతి సమీపంగా ఉన్న క్రిస్టియన్ పేటలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు వార్డు వాలంటీర్లు ఉన్నట్లు గుర్తించారు. వాలంటీర్లు ఇద్దరు గత మూడు రోజుల క్రితం తాడేపల్లిలోని వివిధ ప్రాంతాల్లో పింఛన్లు పంపిణీ చేశారు. దీంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో పురపాలక అధికారులు శానిటేషన్ పనులు చేపట్టారు.
సీఎం నివాస ప్రాంతంలో పెరుగుతున్న కరోనా కేసులు - తాడేపల్లిలో కరోనా కేసులు
ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రాంతం తాడేపల్లిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సీఎం నివాసానికి అతి సమీపంగా ఉన్న క్రిస్టియన్ పేటలో 4 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు వాలంటీర్లకు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు.
corona cases