ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెనాలిలో కరోనాతో వైద్యుడు మృతి.. వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి - తెనాలిలో కరోనాతో వైద్యుడు మృతి

కరోనా వైరస్​తో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆర్​ఎంవో మృతిచెందారు. 4 రోజులక్రితం ఆయనకు వైరస్ సోకగా చికిత్స పొందుతూ మరణించారు. నియోజకవర్గంలో రోజురోజుకూ మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటివరకూ మొత్తం 150 కేసులు నమోదయ్యాయి.

corona cases in tenali guntur district
తెనాలిలో కరోనాతో వైద్యుడు మృతి.

By

Published : Jul 8, 2020, 2:10 PM IST

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ పరిధిలో కరోనా ప్రభావం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో కేసుల సంఖ్య 150కు చేరుకుంది. ఇందులో తెనాలి పట్టణంలో 90 ఉండగా.. గ్రామాల్లో 60 నమోదయ్యాయి.

తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి ఆర్.ఎం.వో ప్రేమ్ కుమార్ కరోనా బారినపడి మృతిచెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 4 రోజుల క్రితం ఆయనకు పాజిటివ్​గా నిర్ధారణ కాగా... కాటూరి ఆసుపత్రికి... అక్కడి నుంచి గుంటూరు జీజీహెచ్​కు తరలించారు. పరిస్థితి విషమించటంతో మంగళవారం సాయంత్రం విజయవాడలోని కొవిడ్ ప్రత్యేక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మరణించారు. తెనాలి మున్సిపల్ కమిషనర్ కూడా వైరస్ బారిన పడ్డారు. ఆయన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగికి కరోనా సోకగా... ఆయన పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది.

కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చిన తెనాలికి చెందిన డ్రైవర్​కు మొదటగా పాజిటివ్ వచ్చింది. అలా అలా నియోజకవర్గంలో వైరస్ వ్యాప్తి చెందింది. పట్టణం నుంచి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చేవారికి కూడా కరోనా సోకింది. వారి ద్వారా మరికొందరికి వ్యాపించింది. ఇలా 40 రోజుల్లోనే కేసుల సంఖ్య 150కు చేరుకుంది.

ఇవీ చదవండి...

గుంటూరు జిల్లాలో కరోనా తీవ్రత.. 2 రోజుల్లో 480 కేసులు

ABOUT THE AUTHOR

...view details