గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆదివారం 40 కేసులు నమోదు కాగా.. 6 కేసులు నరసరావుపేట నియోజకవర్గంలో నమోదైనట్లు అధికారులు తెలిపారు. వీటిలో నరసరావుపేట పట్టణంలో 4 కేసులు రొంపిచర్ల మండలంలో 2 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
నరసరావుపేటలో తాజాగా 6 కరోనా కేసులు - నరసరావుపేటలో తాజాగా 6 కరోనా కేసులు !
గంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో తాజాగా ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. నియోజకవర్గంలో కేసుల సంఖ్య 224కి చేరింది. జిల్లా వ్యాప్తంగా నేడు 40 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
నరసరావుపేటలో తాజాగా 6 కరోనా కేసులు !
కొత్తగా నమోదైన 4 కేసులతో నరసరావుపేటలో పాజిటివ్ కేసుల సంఖ్య 224కు చేరింది. కరోనా కేసులు పెరుగుతున్నందున పట్టణ ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. పట్టణంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు లాక్ డౌన్ సడలింపులలో ప్రజలు భౌతికదూరం పాటిస్తూ మాస్క్లు ధరించాలన్నారు.