నరసరావుపేటలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 17 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 121కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 14 కేసులు వరవకట్టకు చెందినవే. వరవకట్టలో కరోనా పాజిటివ్ కేసులు వందకు చేరువలో ఉన్నాయి. పాజిటివ్ కేసులు వస్తున్న ప్రాంతాల్లో అధికారులు పటిష్ట చర్యలు చేపట్టి ..ఆయా ప్రాంతాలనుంచి ప్రజలను బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
నరసరావుపేటలో మరో 17 కరోనా పాజిటివ్ కేసులు - నరసరావుపేటలో కరోనా కేసులు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ రోజు తాజాగా మరో 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నరసరావుపేటలో 121 కేసులు నమోదయ్యాయి.
corona cases