గుంటూరు జిల్లా మేడి కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన ఉద్యాధ్యాయులు పాఠశాలలోని 8,9,10 తరగతులకు చెందిన 400 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. తరగతి గదులను శానిటైజ్ చేయించారు.
AP CORONA CASES:రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 25,495 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 1,166 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 9,632 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 32,413 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. వైరస్ కారణంగా కొత్తగా మరో ఐదుగురు మరణించినట్లు పేర్కొంది.