ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 155 కేసులు - గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. శనివారం కొత్తగా 155 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు స్పష్టం చేశారు. జిల్లాలో కేసుల సంఖ్య 3,571కు చేరుకుంది.

జిల్లాలో విజృంభిస్తోన్న కరోనా..ఒక్కరోజే 155 కేసులు !
జిల్లాలో విజృంభిస్తోన్న కరోనా..ఒక్కరోజే 155 కేసులు !

By

Published : Jul 11, 2020, 6:43 PM IST

గుంటూరు జిల్లాలో శనివారం కొత్తగా 155 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెల్లడించారు. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,571కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరంలోనే 49 ఉన్నాయి. తెలంగాణా నుంచి వచ్చిన ముగ్గురికి వైరస్ సోకిందని తేలగా... క్వారంటైన్​లో ఉన్న అయిదుగురికి పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు అధికారులు వివరించారు. మంగళగిరిలో 43, నరసరావుపేటలో 21, తాడేపల్లిలో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

సత్తెనపల్లి 4, ప్రత్తిపాడు 3, తాడికొండ 3 చొప్పున... కారంపూడి, నకరికల్లు, పిడుగురాళ్ల, రాజుపాలెంలో 2 కేసులు.. గుంటూరు గ్రామీణ మండలం, అమరావతి, తెనాలి, తుళ్లూరు, వినుకొండ, శావల్యపురం, దాచేపల్లి, దుగ్గిరాల, గురజాల, ఈపూరు, క్రోసూరు, ముప్పాళ్ల, మాచర్ల, రొంపిచర్లలో ఒక్కోకేసు నమోదైనట్లు వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్న 1,398 మందిని ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ చేసినట్లు తెలిపారు. అలాగే కరోనా కారణంగా జిల్లాలో మరణించిన వారి సంఖ్య 29కి చేరుకుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details