ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 20, 2020, 11:02 PM IST

ETV Bharat / state

జిల్లాలో 818కు చేరిన కరోనా కేసులు !

గుంటూరు జిల్లా కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజా 30 కేసులు నమోదు కాగా...మెుత్తం కేసుల సంఖ్య 818కి చేరింది. కేసుల ఉద్ధృతి దృష్ట్యా లాక్ డౌన్ నిబంధలను ప్రజలు ఖచ్చితంగా పాటించాలని పోలీసు స్పష్టం చేశారు. లేకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకంటామని జిల్లా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి హెచ్చరించారు.

జిల్లాలో 818కు చేరిన కరోనా కేసులు !
జిల్లాలో 818కు చేరిన కరోనా కేసులు !

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా 30 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించడంతో మొత్తం కేసుల సంఖ్య 818కి చేరుకుంది. తాజా కేసుల్లో గుంటూరు నగరంలోనే 10 కేసులు బయటపడ్డాయి. మంగళగిరిలో 8 , తాడేపల్లిలో 5, తెనాలిలో 2, బాపట్ల మండలం కంకటపాలెంలో 2, తక్కెళ్లపాడు, గుల్లాపల్లి, కర్లపాలెంలో ఒక్కోకేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

రెడ్డిపాలెంలో ముంబయి నుంచి వచ్చి క్వారంటైన్​లో ఉన్న వ్యక్తికి పాజిటివ్​గా తేలింది. మంగళగిరిలో నమోదైన కేసుల్లో ఇద్దరు డీజీపీ కార్యాలయ సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తాజా కేసులతో కలిపి తాడేపల్లిలో 75, మంగళగిరిలో 45, తెనాలిలో 23కు కరోనా కేసులు పెరిగాయి. జిల్లాలో ఇప్పటివరకు కరోనా బారి నుంచి కోలుకుని 493 మంది ఆసుపత్రల నుంచి డిశ్చార్జ్ కాగా.. 11మంది మరణించారు. మిగతావారు మంగళగిరి ఎన్ఆర్ఐ, గుంటూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కేసుల ఉద్ధృతి దృష్ట్యా లాక్ డౌన్ నిబంధలను ప్రజలు ఖచ్చితంగా పాటించాలని పోలీసు స్పష్టం చేశారు. వాహనాలకు అనుమతి, దుకాణాల వద్ద కరోనా నివారణ జాగ్రత్తలను తప్పకుండా పాటించాలని, లేకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకంటామని జిల్లా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details