గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 17 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 731కి చేరింది. ఈరోజు గుంటూరులో 6, దాచేపల్లిలో 5, తాడేపల్లి, మంగళగిరి, పెదనందిపాడు, నర్సరావుపేట, బాపట్ల, చిలకలూరిపేట మండలం, అప్పాపురంలో ఒక కేసు చొప్పున నిర్ధారాణ అయ్యాయి. పాజిటివ్ వచ్చిన వారిలో 9మందిని ఇప్పటికే క్వారంటైన్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. మిగతా కేసులు నమోదైన ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంతో పాటు ప్రైమరీ కాంటాక్టులను సేకరించే పనిలో పడ్డారు.
జిల్లాలో కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు - గుంటూరులో కరోనా కేసులు
గుంటూరు జిల్లాలో కరోనా రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇవాళ 17 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గుంటూరు నగరంలోనే 6 కరోనా కేసులు వచ్చాయి.
గుంటూరులో కరోనా కేసులు