గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. గతంలో నరసరావు పేట ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తూ.. చిలకలూరి పేటలో ఉంటున్న డాక్టర్ కరోనా బారిన పడి కోలుకోగా... ప్రస్తుతం మరొకరికి కరోనా సోకినట్టు బయటపడింది.
చిలకలూరిపేటలో రెండో కరోనా కేసు నమోదు - చిలకలూరిపేటలో రెండో కరోనా కేసు నమోదు
చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా రెండో పాజిటివ్ కేసు నమోదైంది. అప్రమత్తమైన అధికారులు అతనితో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ ఉన్నవారందరనీ గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
చిలకలూరిపేటలో రెండో కరోనా కేసు నమోదు
ఇటీవలే అనారోగ్యంతో జీజీహెచలో చేరిన ఓ వృద్ధుడు మరణించగా... అతనికి కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో పాజిటివ్ అని తేలింది. అతనితో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ ఉన్నవారందరనీ గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.