ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో పెరుగుతున్న కేసులు... ఆందోళనలో ప్రజలు - గుంటూరు జిల్లాలో కరోనా కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పరిస్థితి కుదుటపడుతుందని భావిస్తున్న తరుణంలో రెండ్రోజులుగా బయటపడుతున్న పాజిటివ్ కేసులు జిల్లా వాసులకు ఆందోళన కల్గిస్తున్నాయి. తాజాగా నేడు మరో 5 కేసులు నమోదయ్యాయి.

By

Published : May 14, 2020, 4:13 PM IST

గుంటూరు జిల్లాలో నేడు మరో 5 కేసులు నమోదు కాగా..నాలుగు కేసులు గుంటూరులోనే ఉన్నాయి. నగర పరిధిలోని ఇస్రాయిల్​పేటలో మూడు కేసులు, ఆనందపేట, తెనాలిలో ఒక్కో కేసు చొప్పున నిర్ధరణ అయ్యాయి. గత రెండ్రోజుల్లో మెుత్తం 17 కేసులు గుర్తించారు. తాజా కేసులతో జిల్లాలో పాజిటివ్ కేసులు 404కి చేరుకున్నాయి.

గుంటూరులోనే 180 కేసులు నమోదయ్యాయి. నరసరావుపేటలో ఇప్పటివరకు 173 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసుల తీవ్రత దృష్ట్యా ఈనెల 17వరకూ సంపూర్ణ లాక్ డౌన్ పొడిగించారు. జిల్లాలో కరోనా వైరస్​తో కోలుకున్న వారి సంఖ్య 246కి పెరిగింది. వీరంతా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. మరో 150మంది చికిత్స పొందుతున్నారు.

తాడేపల్లిలో కేసుల సంఖ్య 12కు చేరుకోవటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేసులు నమోదైన ప్రాంతాన్ని కంటైన్మెంట్ చేయటంతో పాటు పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details