ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసరావుపేటలో కరోనా కలకలం - నరసరావుపేటలో కరోనా కేసుల కలకలం

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా కేసులు పెరుగుతండటం పట్టణ వాసులను కలవరానికి గురిచేస్తోంది. నేడు ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్​ బులిటెన్​లో జిల్లా వ్యాప్తంగా 13 కేసులు నమోదు కాగా.. ఒక్క నరసరావుపేటలోనే 11 కేసులు నమోదయ్యాయి.

నరసరావుపేటలో కరోనా కేసుల కలకలం

By

Published : May 5, 2020, 4:25 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిన్నటి వరకు పట్టణంలో 142 కేసులు నమోదు కాగా... నేడు మరో 11 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 153కు చేరుకుంది. నేడు ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్​లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 13 కేసులు నమోదు కాగా... ఒక్క నరసరావుపేటలోనే 11 కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది.

కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా నమోదైన కేసులకు సంబంధించి సెంకడరీ కాంటాక్ట్​ల వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పట్టణంలో ఆరోగ్యపరమైన సమస్యలున్నవారు తమని సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details