గుంటూరు జిల్లాలో హాట్ స్పాట్ గా మారిన నరసరావుపేటలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ నమోదైన ఏడు కేసుల్లో నాలుగు కేసులు వరవకట్ట ప్రాంతంలో నమోదయ్యాయి. ఒక్క ప్రాంతంలోనే కేసుల సంఖ్య 99కి చేరింది. మరో మూడు కేసులు ఏనుగుల బజార్, పాతూరు ప్రాంతాల్లో నమోదయ్యాయి.
జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య - జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య
గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇవాళ నమోదైన 7 కేసుల్లో 4 నరసరావు పేట ప్రాంతంలోనే నమోదయ్యాయి.
జిల్లావ్యాప్తంగా ఇవాళ 11 కేసులు నమోదు కాగా... గుంటూరు చినబజార్, బావాజీనగర్లో రెండు కేసులు, మంగళగిరి, దాచేపల్లిలో మరో రెండు కేసులు బయటపడ్డాయి. దీంతో గుంటూరు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 319కి పెరిగింది. అయితే గుంటూరు అర్బన్‌లో కేసుల తాకిడి తగ్గడం ఊరటనిచ్చే అంశం. తాజా రెండు కేసులతో కలుపుకుంటే గుంటూరు నగరంలో కేసుల సంఖ్య 146కి చేరింది. కేసులన్నీ కంటైన్మెంట్ జోన్లలోనే వస్తున్న నేపథ్యంలో త్వరలోనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని జిల్లా యంత్రాంగం ఆశాభావంతో ఉంది.