ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు - గుంటూరులో కరోనా కేసులు సంఖ్య

కరోనా మహమ్మారి రోజురోజుకీ భయపెడుతోంది. గుంటూరులో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. పోలీసులు లాక్‌డౌన్​ను కఠినంగా అమలు చేస్తున్నారు. రెడ్ జోన్ల నుంచి వేరే మండలాలకు రాకపోకలు పూర్తిగా నిషేధించారు.

గుంటూరులో 149 కరోనా పాజిటివ్ కేసులు
గుంటూరులో 149 కరోనా పాజిటివ్ కేసులు

By

Published : Apr 21, 2020, 3:21 PM IST

Updated : Apr 21, 2020, 4:07 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. జిల్లాలో ఇవాళ కొత్తగా 9 కేసులు నమోదు కాగా... మొత్తం సంఖ్య 158కి చేరుకుంది. పాజిటివ్ రోగుల సంఖ్య గుంటూరు నగరంలోనే అధికంగా ఉంది. ప్రస్తుతం గుంటూరు నగరంలో 101 మందికి కరోనా సోకింది. నరసరావుపేటలో ఇప్పటి వరకూ 29మందికి కరోనా సోకింది. ఈ రెండు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. లాక్​డౌన్​ను పక్కాగా అమలు చేస్తున్నారు. రోడ్లపైకి 9గంటల తర్వాత ఎవరినీ రానీయటం లేదు. జిల్లాలో రెడ్ జోన్ల నుంచి వేరే మండలాలకు రాకపోకలు పూర్తిగా నిషేధించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత మండలాల్లో విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు.

Last Updated : Apr 21, 2020, 4:07 PM IST

ABOUT THE AUTHOR

...view details