గుంటూరు జిల్లా నరసరావుపేటలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం మరో 3 కొత్త కేసులు నమోదు కాగా... మొత్తం కేసుల సంఖ్య 185కు చేరుకుంది. జిల్లాలో ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన నివేదికలో 6 కేసులు నమోదు కాగా వాటిలో 3 కేసులు నరసరావుపేటలో నమోదకావటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
నరసరావుపేటలో మరో మూడు పాజిటివ్ కేసులు - నరసరావుపేటలోపాజిటివ్ కేసులు
కరోనా నియంత్రణ చర్యలు ముమ్మరం చేసినప్పటికీ గుంటూరు జిల్లా నరసరావుపేటలో కేసుల సంఖ్య తగ్గటం లేదు. గురువారం జిల్లా వ్యాప్తంగా ఆరుగురికి కరోనా సోకగా... నరసరావుపేటలోనే 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
నరసరావుపేటలో మరో మూడు పాజిటివ్ కేసులు
అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ పట్టణంలో కరోనా కేసులు ఆగటం లేదు. గత 15 రోజులు నుంచి సంపూర్ణ లాక్ డౌన్ నిర్వహించినా... కేసులు మాత్రం ప్రతిరోజూ వస్తునేవున్నాయి. రోజురోజుకూ పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.