గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా నిన్న మరో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులోని నల్లపాడు, కేవీపీ కాలనీ, మద్దిరాల కాలనీ, లక్ష్మీపురం, దాచేపల్లి, నరసరావుపేటలో కొత్త కేసులు నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. తాజా కేసులతో గుంటూరు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 583కు చేరింది. ఇప్పటివరకు గుంటూరు నగరంలో 222 కేసులు, నరసరావుపేటలో 202 కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ నిబంధనలు సడలించగా రెండురోజులుగా హోటళ్లు, షాపింగ్ మాల్స్ పాక్షికంగా తెరుచుకున్నాయి. ప్రజల సంచారం బాగా పెరిగిందని అధికారులు అంటున్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు వైరస్ విస్తరించటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
600కు చేరువలో పాజిటివ్ కేసులు
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒక్కరోజే ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకూ కరోనా బారినపడిన వారి సంఖ్య 583కు చేరింది.
corona cases in guntur dst increasing daily reaches nearly to six hundred