ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Corona cases: గుంటూరు జిల్లాలో తగ్గిన కరోనా ఉద్ధృతి - గుంటూరు జిల్లా కరోనా వార్తలు

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా జిల్లాలో 305 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అధికారులు పెద్ద ఎత్తున చేపడుతున్నారు.

guntur corona cases news
guntur corona cases news

By

Published : Jun 20, 2021, 10:28 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా జిల్లాలో 305 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రెండో దశ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇంత తక్కువగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. తాజాగా గుంటూరు నగరపరిధిలో 39 కేసులు నమోదు కాగా.. చిలకలూరిపేట, గురజాలలో 14 కేసులు చొప్పున, పొన్నూరులో 13, సత్తెనపల్లి, పిడుగురాళ్లలో 11 కేసులు , నాదెండ్ల, నరసరావుపేట, నూజెండ్ల, రొంపిచర్ల మండలాల్లో 10 కేసులు చొప్పున నమోదయ్యాయి.

ప్రస్తుతం జిల్లాలో క్రియాశీల కేసులు 3,678గా ఉన్నాయి. మరోవైపు మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇవాళ కరోనాతో ఆరుగురు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1055కి చేరింది. మరోవైపు జిల్లాలో వైద్యాధికారులు.. మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు.

ఇదీ చదవండి:RTC: గుంటూరు జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు 103 ఆర్టీసీ సర్వీసులు

ABOUT THE AUTHOR

...view details