ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 89 కేసులు నమోదు - గుంటూరు జిల్లాలో కరోనా వార్తలు

గుంటూరు జిల్లాలో నేడు కొత్తగా 89 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 73,573కి చేరింది. ఈరోజు వైరస్​తో ఒకరు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 654కి చేరింది.

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు

By

Published : Dec 8, 2020, 7:31 PM IST

గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. జిల్లాలో కొత్తగా 89 కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 73,573కి చేరింది. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరం నుంచి 21 కేసులు ఉన్నాయి. బాపట్ల-12, అమరావతి-6, నరసరావుపేటలో-6 కేసుల చొప్పున నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకుని 72,076 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ బారిన పడి గుంటూరులో మరొకరు మృతి చెందారు. దీనితో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 654కి చేరింది.

ABOUT THE AUTHOR

...view details