గుంటూరు జిల్లాలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. జిల్లాలో కొత్తగా 50 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మెుత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 71వేల 46కు చేరుకుంది.
ఇవాళ నమోదైన కేసుల్లో గుంటూరు నగర పరిధి నుంచి కేవలం 14 కేసులు మాత్రమే నమోదయ్యాయి. నరసరావుపేటలో 12 కేసులు, బాపట్ల నుంచి 6 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా తాజాగా ఒకరు మృతి చెందారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 639కి చేరింది. వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 68వేల 345 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా ఎక్కువగా మరణాలు సంభవిస్తున్న జిల్లాల్లో గుంటూరు రెండవ స్థానంలో కొనసాగుతోంది.