గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 378 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 65 వేల 904 కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరం నుంచే 76 కేసులు బయటపడ్డాయి. తెనాలిలో 66 కేసులు, మంగళగిరిలో 22, దాచేపల్లిలో 17, నరసరావుపేటలో 16, వట్టిచెరుకూరులో 15, తాడేపల్లిలో 13, చిలకలూరిపేట, అమర్తలూరులో 10 కేసులు చొప్పున నమోదయ్యాయని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు వెల్లడించారు.
జిల్లాలో కొత్తగా 378 పాజిటివ్ కేసులు.. నలుగురు మృతి
గుంటూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా జిల్లాలో 378 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఒక్కరోజే నలుగురు మృతి చెందారు.
corona cases
గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 60వేల 376 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో ఇవాళ జిల్లాలో నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 606 కి చేరింది. రాష్ట్రంలో కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఇదీ చదవండి:రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త