గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 387 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 64 వేల 222కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరంలోనే 88 ఉన్నాయి. ఇక మండలాల వారీగా నమోదైన కేసుల వివరాలు చూస్తే.. మంగళగిరి 21, సత్తెనపల్లి 15, తాడేపల్లి 17, చిలకలూరిపేట 22, నరసరావుపేట 20, బాపట్ల 26, దుగ్గిరాల 10, రేపల్లె 26, తెనాలి 21 కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బులిటెన్ విడుదల చేశారు.
జిల్లాలో కొత్తగా 387 కరోనా కేసులు..ముగ్గురు మృతి
గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 387 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ ప్రభావంతో ఇవాళ జిల్లాలో ముగ్గురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 591కు చేరింది.
corona cases in guntur district
జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 121 కేసులు వచ్చాయని తెలిపారు. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 58వేల 667 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో ఇవాళ జిల్లాలో ముగ్గురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 591కు చేరింది. రాష్ట్రంలో కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు రెండో స్థానంలో ఉంది.
ఇదీ చదవండి:నవంబరు 2 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం