గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలకు చేరువైంది. తాజా లెక్కల ప్రకారం.. జిల్లాలో కొత్తగా 670 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లావ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 48,934 కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 39,698 మంది ఇంటికి చేరుకున్నారు.
తాజాగా... వైరస్ ప్రభావంతో ఆరుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 475 కు చేరింది. రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 133 కేసులు నమోదయ్యాయి. మండలాల వారీగా.. నరసరావుపేట-40, తెనాలి-39, తాడేపల్లి-38, నాదెండ్ల-31, కర్లపాలెం-31, కాకుమాను-28, వినుకొండ-24, మాచర్ల-23, మంగళగిరి-20, సత్తెనపల్లి-19, రెంటచింతల-19, బాపట్ల-18, అచ్చంపేట-14, వట్టిచెరుకూరు-13, మాచవరం-11, నగరం-11, పొన్నూరు-11 చొప్పున కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.