రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు గుంటూరు జిల్లా యంత్రాంగానికి సవాల్‌గా మారాయి. బుధవారం కొత్తగా 730 కేసులు రాగా.. మొత్తం కేసుల సంఖ్య 20,170కు చేరింది. కొత్తగా వచ్చిన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 242 నమోదయ్యాయి. మాచర్ల 102, నర్సరావుపేట 50, తెనాలి 46, బాపట్ల 40, పొన్నూరు 37, సత్తెనపల్లి 30, నకరికల్లు 16, పిడుగురాళ్ల 12, అమరావతి 14, రొంపిచెర్ల 12, చిలకలూరిపేట 12, దుగ్గిరాల 11, నాదెండ్ల 9, ఫిరంగిపురం 9 కేసులు వచ్చాయి. మిగతా ప్రాంతాల్లో 124 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
ప్లాస్మా థెరపీపై దృష్టి
జిల్లాలో కరోనా నుంచి కోలుకుని 11,374 మంది ఇళ్లకు వెళ్లారు. ఇప్పటివరకు 179 మంది మరణించారు. ఇందులో 16 మంది బుధవారం ఒక్కరోజే మృతిచెందారు. దీంతో వైద్య సౌకర్యాలు మెరుగుపర్చటంతో పాటు కొత్తగా ప్లాస్మా థెరపీని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం కొవిడ్ విజేతల నుంచి ప్లాస్మా సేకరణ ప్రారంభించారు. రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రాల్లో ప్లాస్మా సేకరించేలా ఏర్పాట్లు చేశారు. ఎవరికి ప్లాస్మా చికిత్స చేయాలో నిర్ణయించేందుకు జిల్లా స్థాయిలో వైద్య నిపుణులతో 2 కమిటీలు వేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఎన్.ఆర్.ఐ ఆసుపత్రిలో కొవిడ్ బాధితులకు ప్లాస్మా థెరఫీ అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
కొవిడ్ విజేతలు ముందుకురావాలి