గుంటూరు జిల్లాలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు వారాలుగా కరోనా విజృంభణతో జిల్లాలో మొత్తం కేసులు 4వేలు దాటాయి. తాజాగా ఒక్క రోజే 387 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 4వేల 213కి చేరింది. ఈ రోజు అత్యధికంగా 243 కేసులు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే నమోదు కావడం తీవ్రతను తెలియజేస్తోంది. తాడేపల్లి మండలంలో 16, తెనాలి 23, నరసరావుపేట 25, మంగళగిరి 16 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
విజృంభిస్తున్న కరోనా.. జిల్లాలో ఒక్కరోజే 387 కేసులు
కరోనా మహమ్మారి తన విశ్వరూపం చూపిస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. గుంటూరు జిల్లాలో ఒక్కరోజే ఏకంగా 387 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలతో పాటు..అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది. కరోనా కట్టడికి తగు చర్యలు తీసుకుంటోంది.
సత్తెనపల్లి, బొల్లాపల్లిలో 6 చొప్పున కేసులు, చిలకలూరిపేట , అమరావతిలో ఐదేసి కేసులు, పెద్దనందిపాడు 4, గురజాల, రేపల్లె, పిడుగురాళ్లలో మూడు కేసులు చొప్పున నమోదయ్యాయి. పెద్దకాకాని, శావల్యాపురం, తాటికొండ, మాచర్ల, చుండూరు, క్రోసూరులో రెండేసి కేసులు, అచ్చంపేట, బాపట్ల , దాచేపల్లి, దుగ్గిరాల, దుర్గి, యడ్లపాడు, గుంటూరు రూరల్, ఈపూరు, నూజెండ్ల, పెదకూరపాడు, పొన్నూరు, రొంపిచర్ల, తుళ్లూరు, చుండూరు, వట్టిచెరుకూరు, వేమూరులో ఒకటి చొప్పున కేసులు బయటపడ్డాయి. ఒకేరోజు ఇంతపెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడంతో సాధారణ ప్రజలతోపాటు అటు జిల్లా యంత్రాంగం ఆందోళన చెందుతోంది. కంటైన్మెంట్ జోన్లలో కట్టడి వ్యూహాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 1,935 కరోనా కేసులు, 37 మంది మృతి