గుంటూరు జిల్లాలో బుధవారం ఒక్కరోజే 117 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కొత్త ప్రాంతాలకు వైరస్ వ్యాపిస్తోంది. బుధవారం తాడేపల్లి మండలంలో 25, తెనాలి 8, మంగళగిరి 3, పెదకాకాని 4, మాచర్ల 4, సత్తెనపల్లి 3, చిలువూరు 2, పెదకూరపాడు 2 కేసులు వచ్చాయి. తాడికొండ, చుండూరు, చిలకలూరిపేట, నరసరావుపేట, కూచిపూడి, దుగ్గిరాల, వినుకొండ, చాకలిగుంట, కొప్పురావూరు, వేజండ్ల, దాచేపల్లిలో 1 కేసు చొప్పున నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో అత్యధిక కేసుల్లో గుంటూరు 654, నరసరావుపేట 257, తాడేపల్లి 190, మంగళగిరి 66, తెనాలి 70, పెదకాకాని 26, చిలకలూరిపేట 24, దాచేపల్లి 24 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1673కు చేరుకుంది.
నగరంలోని అధిక ప్రాంతాలకు విస్తరణ
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏటీ. అగ్రహారం 7, నెహ్రు నగర్, నల్ల చెరువు, ఎంప్లాయీస్ కాలని, లాలాపేట, యాదవ బజార్, బ్రాడిపేట, చంద్రమౌళి నగర్లలో 2 కేసులు నమోదైనట్లు తెలిపారు. నల్లపాడు, వికాస్ నగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, యస్.వి.యన్. కాలనీ, పోస్టల్ కాలనీ, చౌత్రా, కోబాల్ పేట, సీతానగర్, నల్లకుంట, సుబ్బారెడ్డి నగర్, రైల్ పేట, పాత గుంటూరు, గోరంట్ల, నాయుడు పేట, శ్రీ నగర్, డి.యస్.నగర్, శాంతి నగర్, పొత్తూరి వారి తోట, సంపత్ నగర్, ముత్యాల రెడ్డి నగర్, రైల్వే స్టేషన్ (ఆర్.పి.యఫ్. కానిస్టేబుల్)లో 1 కేసు నమోదైనట్లు వివరించారు.
కరోనాకు కేంద్రంగా తాడేపల్లి