ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో కొత్తగా 92 కరోనా పాజిటివ్ కేసులు - గుంటూరులో కరోనా వార్తలు

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్తగా 92 కేసులు నమోదవ్వగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,285కు చేరుకుంది. తాజా కేసులతో గుంటూరు నగరంలో కేసులు 489కు చేరాయి.

corona cases in guntur district
గుంటూరు జిల్లాలో 92 కొత్త కేసులు

By

Published : Jun 27, 2020, 7:44 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ అధికమవుతోంది. జిల్లాలో కొత్తగా 92 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,285కు చేరింది. కొత్త కేసుల్లో గుంటూరు నగరంలో 44, మంగళగిరి 8, తాడేపల్లి 6, తెనాలి 7, దాచేపల్లి 4, చిలువూరులో 3 కేసులు నమోదయ్యాయి. సత్తెనపల్లి, ఫిరంగిపురం, మాచర్ల, చినమద్దిపూడిలో 2 చొప్పున, నంబూరు, గామలపాడు, రేవేంద్రపాడు, కంభంపాడు, నాగులవరం, కొర్రపాడు, దుగ్గిరాల, పెదవడ్లపూడి, నరసరావుపేట, వడ్డేశ్వరం, ఉండవల్లిలో 1 చొప్పున వెలుగుచూసినట్లు అధికారులు వెల్లడించారు.

గుంటూరులోని క్వారంటైన్ కేంద్రంలో 8 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు తెలిపారు. తాజా కేసులతో గుంటూరు నగరంలో కేసులు 489కు చేరుకున్నాయి. నరసరావుపేటలో 228, తాడేపల్లి 156, తెనాలి 64, మంగళగిరి 58, దాచేపల్లి 24, దుగ్గిరాల 23కు చేరినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details