గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే జిల్లాలో 70 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య ఒక 1,035కు చేరింది. కొత్త కేసుల్లో నగరంలో 27 కేసులు వచ్చినట్లు తెలిపారు. తెనాలిలో 13, తాడేపల్లి 12, నరసరావుపేట 3, మాచర్ల 2, మంగళగిరి 6, బాపట్ల 2 పాజిటివ్ కేసులు వచ్చాయి. సత్తెనపల్లి, నంబూరు, నిజాంపట్నం, పెదనందిపాడు, కనపర్రు, రేవేంద్రపాడులో ఒకటి చొప్పున నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
నగరంలోనే ఎక్కువ
పాజిటివ్‌గా తేలిన వారిలో 10మంది ఇప్పటికే క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు. గుంటూరు నగరంలో అంకిరెడ్డి పాలెంలో 2, డి.యస్.నగర్ 1, వెంకట రామయ్య కాలనీ 1, ఏ.టీ అగ్రహారం 1, పట్టాభిపురం 2, ఆర్టీసీ కాలనీ 1 , కేవీపీ కాలనీ 1, గుండరావుపేట 1, నల్లచెరువు 1, ఐపీడీ కాలనీ 6, కాటూరి మెడికల్ కాలేజ్ క్వారెంటైన్ 3, బృందావన్ గార్డెన్స్ 1, సంగడిగుంట 3, లాలపేట 1, చౌడవరం 1, శ్యామలా నగర్లో 1 కేసు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి గుంటూరు నగరంలో కేసుల సంఖ్య 367, నర్సరావుపేటలో 225, తాడేపల్లిలో 109 కు చేరుకుంది. మిగతా మండలాల్లో 334 కేసులున్నాయి.
లాక్ డౌన్ సడలిస్తున్న కొద్దీ పెరుగుతున్న కేసులు