ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓ వైపు కేసులు.. మరోవైపు సడలింపులు - గుంటూరు లాక్ డౌన్

ఓ పక్క రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోనే కొవిడ్ కేసుల్లో గుంటూరు జిల్లా రెండోస్థానంలో ఉంది. ఇన్నాళ్లు పట్టణ ప్రాంతాల్లో విజృంభించిన మహమ్మారి.. పల్లెలకూ పాకుతోంది. ఈ నేపథ్యంలో మరిన్ని లాక్​డౌన్ సడలింపులతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లలో తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

corona cases in guntur district
ఓవైపు కేసులు.. మరోవైపు సడలింపులు..

By

Published : Jun 8, 2020, 12:58 PM IST

ఓ పక్క పెరుగుతున్న కరోనా కేసులు.. మరోపక్క లాక్​డౌన్ సడలింపులు.. గుంటూరు జిల్లా యంత్రాంగానికి సవాల్​గా మారాయి. ఆదివారం జిల్లాలో మరో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 568కు చేరింది. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదైన జిల్లాల్లో గుంటూరు రెండోస్థానంలో కొనసాగుతోంది. ఇన్నాళ్లూ పట్టణ ప్రాంతాలను కుదిపేసిన కొవిడ్.. ఇప్పుడు పల్లెప్రాంతాలకు విస్తరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం గుంటూరులో 216, నర్సరావుపేటలో 200, తాడేపల్లిలో 22 కేసులున్నాయి. ఆదివారం నమోదైన కేసులలో గుంటూరు సీతానగరంలో ఒకరు, దుగ్గిరాలలో ఒక కానిస్టేబుల్ ఉన్నారు. నేటి నుంచి లాక్​డౌన్ ఆంక్షల సడలింపుల నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంపై యంత్రాంగం దృష్టి సారించింది.

గుంటూరు మిర్చియార్డు, కొల్లి శారద మార్కెట్లు.. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి పెట్టారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలని సూచించారు. దుకాణాలు, మాల్స్​, హోటళ్లలో శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ వంటివి ఉండాలని ఆదేశించారు.

ఇవీ చదవండి...

కుటుంబాన్ని వెలివేసిన గ్రామ పెద్దలు...ఎందుకంటే..!

ABOUT THE AUTHOR

...view details